- హస్నాబాద్లో ఘనంగా సీతారాముల సమేత లక్ష్మణ, ఆంజనేయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ.
- మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, విజయమ్మ…పొంగులేటి మాధురి రెడ్డి… పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ తంబూరి దయాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు.
తిరుమలాయపాలెం,జూలై 9 (నమస్తేన్యూస్ )
మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల సమేత లక్ష్మణ, ఆంజనేయస్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు.ఈ కార్యక్రమంలో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, విజయమ్మ దంపతులు పొంగులేటి మాధురి రెడ్డి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జి తంబూరి దయాకర్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు అంత సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని వారు దేవుడిని ప్రార్థించారు.స్థానిక గ్రామపంచాయతీ సర్పంచ్ కొవ్వూరి పద్మ సత్తిరెడ్డి ఆధ్వర్యం లో గ్రామ ప్రజల సహకారంతో నూతన దేవాలయ నిర్మాణం చేపట్టి పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పేలా ఈ దేవాలయం నిర్మించబడిందని, భవిష్యత్తులో కూడా వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ కొవ్వూరి పద్మ సత్తిరెడ్డి ఉపసర్పంచ్ మాజీ బాలకృష్ణ కొవ్వూరి సందీప్ రెడ్డి మాగి వెంకట్ బండారు పాపిరెడ్డి బండారు సత్తిరెడ్డి సత్తిబాబు పాల వెంకన్న పసలాది మధు బాతిక లింగయ్య కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొప్పుల అశోక్ ఆత్మ కమిటీ డైరెక్టర్ ఉప్ప నూతల నాగేశ్వరరావు బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భాషబోయిన వీరన్న, సుబ్లేడ్ సర్పంచ్ సంఘ బత్తుల స్వాతి సుమన్ రెడ్డి మేడిదపల్లి సర్పంచ్ మోర అనిల్ రెడ్డి లక్ష్మీదేవి పల్లి సర్పంచ్ మూడు వెంకట్ నాయక్ సుబ్లేడ్ మాజీ సర్పంచ్ మందడి ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు.

