- తండ్రిపై దాడి..కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు.
- మద్యం మత్తులో విచక్షణ కోల్పోతున్న మందుబాబులు.
నర్సింహులపేట, జూలై 10 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో మద్యం మత్తులో కుమారుడు తల్లిదండ్రులను వేధిస్తూ దాడులకు పాల్పడుతున్నాడంటూ ఓ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు.పెద్దనగారం గ్రామానికి చెందిన జిల్లోజు సుదర్శన చారి (74) తన కుమారుడు జిల్లోజు నరేంద్ర చారి గత నాలుగేళ్లుగా మద్యం మత్తుకు బానిసై తనను, తన భార్యను తీవ్రంగా వేధిస్తూ చంపేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాణభయంతో తాము వేర్వేరు ప్రాంతాల్లో నివసించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నెల 7న తన భార్యను ఇంట్లోకి ఈడ్చుకెళ్లి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఇనుపరాడ్‌తో దాడి చేసేందుకు ప్రయత్నించగా ఆమె తప్పించుకుందని తెలిపారు. అనంతరం జూలై 8న బస్సులో తనపై దాడి చేసి, పెద్దనగారం వద్ద బస్సు నుంచి ఈడ్చుకెళ్లి మరోసారి కొట్టడంతో పాటు చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని తనను రక్షించినట్లు తెలిపారు.కుమారుడు జిల్లోజు నరేంద్ర చారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని సుదర్శన చారి పోలీసులను కోరారు.
