
తిరుమలాయపాలెం, జూలై 19 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం లోని తిప్పారెడ్డిగూడెం గ్రామంలో వరుణదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తిప్పారెడ్డిగూడెం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ మరియు పాలకమండలి ఆధ్వర్యంలో గ్రామదేవతలకు భక్తిశ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించారు.. గ్రామంలోని మహిళలు యువతులు తలలపై జల బిందెలను మోసుకుంటూ బొడ్రా వద్దకు చేరి బొడ్రాయి మరియు ఊరి ముత్యాలమ్మ గుడి వద్ద దేవత విగ్రహాలకు జలాభిషేకం నిర్వహించారు… మంచి వర్షాలు కురిసి వ్యవసాయం అభివృద్ధి చెందాలని, ప్రతి రైతు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు.. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ గారు, పాలక మండలి సభ్యులు, మరియు పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.

