ప్రమీల సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించిన ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూదన్.
తిరుమలాయపాలెం,జూలై 13(నమస్తే న్యూస్)
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి ఆస్పత్రి యజమాన్యాలు కృషి చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూదన్ అన్నారు.ఖమ్మం లోని తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామ నివాసి అయిన పిట్టల నాగేశ్వరరావు నెలకొల్పిన ప్రమీల సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూదన్ మర్యాదపూర్వకంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యుల సేవలు, అత్యవసర చికిత్సా విభాగం, వైద్య సేవల గురించి హాస్పిటల్ నిర్వాహకులు తాతా మధుసూదన్ కు వివరించారు.ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో హాస్పిటల్ నిర్వహణ చేస్తున్న కృషిని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అభినందించారు. భవిష్యత్తులో కూడా మరింత మంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ సేవాభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు పిట్టల నాగేశ్వరరావు, పిట్టల సతీష్ లను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పగడాల నాగరాజు, బొమ్మెర రామ్మూర్తి, బలుసు మురళి, సద్దాం షేక్, మహమ్మద్ రఫీ, మహమ్మద్ షారుక్, పటేటి సాయి, భరత్, సాయి తదితరులు పాల్గొన్నారు.

