- రైతు ఆశీర్వాద సభకు తిరుమలాయపాలెం నుంచి జనసంద్రం.
- 148 బస్సుల్లో రైతులు, మహిళల భారీ తరలింపు!
- సీఎం సభ విజయవంతం.
తిరుమలాయపాలెం,జూలై 10 (నమస్తే న్యూస్ )
చింతకాని మండలం జగన్నాధపురం లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పాల్గొననున్న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో తిరుమలయపాలెం మండలం నుంచి అపూర్వ స్పందన లభించింది. మండలంలోని 40 గ్రామ పంచాయతీల నుంచి 148 బస్సుల్లో డ్వాక్రా గ్రూపు సంఘాల మహిళలు, రైతులు మండల వివో ఏ ల ఆధ్వర్యంలో భారీగా సభకు బయలుదేరారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు పిండిప్రోలు కాకరవాయి సోలిపురం సుప్లేడు బీరోలు జూపెడ జల్లేపల్లి హైదర్ సాయి పేట పాతర్లపాడు తిరుమలాయపాలెం కోక్కిరేణి ఎర్రగడ్డ ఆయా గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున సభకు తరలివెళ్లారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహిస్తున్న ఈ సభ విజయవంతం కానుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి సోలిపురం సర్పంచ్ నునావత్ సమ్మక్క అశోక్ కోప్పుల రామ్ రెడ్డి జూపెడ సర్పంచ్ వనవాసం నరేందర్ రెడ్డి జడల నగేష్ గౌడ్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దూదిమెట్ల వెంకట్ జాల కిరణ్ చామకూరి శ్రీనివాసరావు పప్పుల సుధాకర్ దొడ్డ గురవయ్య రావూరి యాకోబ్రావ్ పొట్ల కిరణ్ తాటికొండ కిరణ్ సర్పంచులు సంఘ బత్తుల స్వాతి సుమన్ రెడ్డి గుమ్మడి బిక్షం ధారావత సుజాత నల్లమల కీర్తి నిరన్ మార్ పుసలూరి సురేష్ జాల కిరణ్ గొల్ల లింగన్న వీరన్న బెజ్జనబోయిన నరేష్ రాంబాబు వేల్పుల వీరన్న భాస్కర్ గుగ్గిళ్ళ అంబేద్కర్ పీడియాల నవీన్ పిడమర్తి రాజేష్ సైదా లక్ష్మణరావు చామకూరి రమేష్ నాగన్న కట్ల రాము తదితరులు పాల్గొన్నారు.

