For scrolling /publish
=================
*హైదరాబాద్ తెలంగాణ భవన్లో అంగన్వాడీల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు*🔥🔥
25-06-2026
*హైదరాబాద్, తెలంగాణ భవన్:*
■ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో *మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు,ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు వాటిని పూర్తిగా విస్మరించి వారి జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు
● అంగన్ వాడీల రిక్రూట్ మెంట్ లో అక్రమాలకు తెరలేపిన రేవంత్ సర్కార్
● ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ వారికే దోచిపెట్టే కుట్ర
● అంగన్ వాడీలకు 10 మార్కులు వేసే అధికారం కలెక్టర్లకు ఇస్తే
ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంఛార్జ్ మంత్రుల సిఫారసులు నడుస్తాయి
● అర్హులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది అన్నారు
● అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నప్పటికీ వారికి సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత, కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ప్రస్తుత వేతనాలతో కుటుంబాలను పోషించడం అసాధ్యంగా మారిందని, అయినప్పటికీ ప్రభుత్వం వారి గోడును పట్టించుకోవడం లేదని విమర్శించారు
● అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కొరత, పౌష్టికాహార సరఫరాలో జాప్యం, అవసరమైన సామగ్రి అందకపోవడం వంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు,ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కొత్త జీవోలు, కొత్త ప్రకటనల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు
● అంగన్వాడీ ఆయాలకు ఇంటర్ అర్హత నిబంధనను సడలించి సంబంధిత జీవోను వెంటనే సవరించాలని ఆమె డిమాండ్ చేశారు,అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు
● గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి మూడు సార్లు వేతనాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన ఆహారం అందించామని గుర్తు చేశారు,
అయితే కాంగ్రెస్ పాలనలో పౌష్టికాహార సరఫరా వ్యవస్థ గాడి తప్పి, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొందని విమర్శించారు
*కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రతి స్కీం వెనుక స్కామ్ ఉంది*
★ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాలు అంటూ నిరుద్యోగులను మోసం చేసిన హామీల మాదిరిగానే అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని సత్యవతి రాథోడ్ గారు ఆరోపించారు,ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు కట్టుబడి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలతో కలిసి ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు
● కాంగ్రెస్ పార్టీ నాయకుల మోసపూరిత మాటలు నమ్మొద్దని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న అన్నారు
● అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని, హామీల అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని *మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* డిమాండ్ చేశారు
Plz cover…..
