- స్మార్ట్‌ఫోన్ లేని రైతులకు ఊరట.. రూ.10తో ఆన్లైన్ బుకింగ్ అవకాశం.
- మీసేవలో యూరియా బుకింగ్ సేవలు ప్రారంభం.
![]() |
| మీసేవ ద్వారా యూరియా బుకింగ్ చేస్తున్న రైతు యాకన్న |
నర్సింహులపేట, జూలై 10 (నమస్తే న్యూస్)
వర్షాకాల సాగు సీజన్లో రైతులకు యూరియా ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం లేక ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా మారనుంది.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని మీసేవ కేంద్రాల్లో రైతులు కేవలం రూ.10 సేవా రుసుముతో యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో రైతులు ఇతరులపై ఆధారపడకుండా సమీప మీసేవ కేంద్రంలోనే సులభంగా బుకింగ్ పూర్తి చేసుకోవచ్చు.యూరియా బుకింగ్ కోసం రైతులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డుతో పాటు ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ తప్పనిసరిగా తీసుకురావాలని మీసేవ నిర్వాహకులు సూచిస్తున్నారు.ఈ సేవను రైతులు సద్వినియోగం చేసుకుని ముందస్తుగా యూరియా బుక్ చేసుకోవాలని అధికారులు, మీసేవ నిర్వాహకులు కోరుతున్నారు.
