డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
మహబూబాబాద్ జిల్లా,జూన్27(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ పట్టణంలోని స్నేహ నగర్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఏంఆర్ఎస్, గూడూరు) లో స్త్రీ శిశు సంక్షేమ, వయోవృద్ధులు,దివ్యాంగులు,ట్రాన్స్ జెండర్ వ్యక్తుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్,సూచనల మేరకు సంబంధిత అన్ని విభాగాల శాఖలతో కలిసి మాదకద్రవ్యాల నిరోధక,తీసుకోవలసిన చర్యలు అవగాహన సమావేశం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎక్సైజ్ సూపర్డెంట్ కిరణ్ కుమార్,డిఎంహెచ్వో డాక్టర్ రవి రాథోడ్, డీఎస్పీ తిరుపతిరావు, ఇన్చార్జి వెల్ఫేర్ అధికారిని శిరీష, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ట్రైనింగ్, నిశాంత్ కుమార్, ఇంటర్మీడియట్ అధికారి మదర్, డివైఎస్ఓ జ్యోతి, విద్యాశాఖ అధికారులు శ్రీరాములు,అప్పారావు,స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ కుమార్, తదితరులు పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల నివారణ,కట్టడికి జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందులో భాగంగానే అట్టి ప్రదేశాలు,అనుమానిక వ్యక్తులను గుర్తించి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.రాత్రి సమయాలలో స్వయంగా ఎస్పీ, పోలీస్ సిబ్బంది మఫ్టీలో ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ గంజాయి సేవించే వ్యక్తులను గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందని,గంజాయి సాగు చేసిన,సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.జిల్లాలో గంజాయి రవాణా సాగు ఎలాంటి సమాచారం ఉన్న 1098 నెంబర్కు కాల్ చేయాలని, ఫోన్ చేసిన వారి సమాచారం అత్యంత గోప్యంగా ఉంచడం జరుగుతుందని, వారికి నగదు ప్రోత్సాహకం కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. బాల్యవివాహాల నివారణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని,సమాచారం సేకరించి ఇప్పటివరకు సుమారు 100 వివాహాలను ఆపడం జరిగిందన్నారు,స్కూల్ విద్యార్థిని,విద్యార్థులు డ్రగ్స్, మాదకద్రవ్యాల నిరోధక పై ప్రసంగం, పాట పాడి అందరినీ ఆకట్టుకున్నారు,ఈ సమావేశంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు చిరంజీవి, సంబంధిత శాఖల సిబ్బంది చైతన్య, కమలాకర్, వీరన్న, నరేష్ ,హరీష్, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
