అనధికారికంగా ఇసుక డంపులు.
అధిక ధరలకు ఇసుక అమ్మకం.
అంత మా ఇష్టం.దిక్కున చోటు చెప్పుకోండి.
భారంగా మారుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.
లబ్ధిదారుడు భూక్యా లలిత రమేష్ నాయక్.
డోర్నకల్/మరిపెడ(జులై 08)నమస్తే న్యూస్.
అనధికారికంగా ఇసుక తరలించి,డంపింగులు ఏర్పాటు చేసుకుని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 7000 వేల రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు..మహుబూబాద్ జిల్లా మరిపెడ మండలం యలమంచిలి తండా, గిరిపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఇటుకుల గడ్డ తండాలో అనుమతు లేని ఇసుక దంపులను ఓ వ్యక్తి, వారి సమీప బంధువు సూర్యాపేటలో ఉంటూ ఇందిరమ్మ లబ్ధిదారులకు అధిక ధరలకు ఇసుకను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.
మరిపెడ మండలం గిరిపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఇటుకల గడ్డ తండాకు చెందిన వ్యక్తి, సూర్యాపేట నివాసి,తండాలలో ఇండ్లు కట్టుకునే వారు తమ వద్దనే ఇసుక కొనాలి,మేము చెప్పిన ధరకే ఇసుకను కొనుగోలు చేయాలని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు భూక్యా రమేష్ మీడియాతో వాపోయారు.తక్కువ ధరకు ఇసుకను కొనుగోలు చేసుకుని ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటే,భూక్యా నవీన్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.మేము ఇలాగే అమ్ముతాము,మా దగ్గరే కొనాలి అని దౌర్జన్యం చేస్తున్నారని,మీరు ఎవరికీ చెప్పుకుంటారో ఏమి చేసుకుంటారో అది చేసుకొండి,నేను ఎవరికి భయపడేది లేదంటూ వార్నింగ్ ఇచ్చాడన్నారు.మరిపెడ ఎమ్మార్వో కృష్ణవేణికు రాతపూర్వకంగా లబ్ధిదారుడు భూక్యా లలితరమేష్ నాయక్ ఫిర్యాదును అందజేశారు. నా ఇల్లు నిర్మాణానికి అవసరమైన ఇసుకను 7000 కొనుగోలు చేస్తానన్న,మూడు రోజుల నుండి ఇబ్బంది పెడుతూ ఇసుక తోలడం లేదన్నారు.అలాగని మరో ట్రాక్టర్ ద్వారా ఇంటి నిర్మాణానికై 4వేల రూపాయలతో ట్రాక్టర్ తీసుకొని తోలుకుంటే, మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, మా ఇంటీపై గొడవకు వచ్చారన్నారు. స్థానిక సర్పంచ్ భద్రు నాయక్, ఉప సర్పంచ్ భూక్యా నవీన్ కు అర్థమయ్యే విధంగా చెప్పి బ్రతిమాలిన ఇబ్బందులకు గురి చేశారన్నారు. అక్రమంగా ఇసుక డంపులను నిలువ చేసుకొని అధిక రేట్లకు ఇసుకను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారన్నారు.ఇప్పటికైనా ఆక్రమ ఇసుక నిలువలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోకు వినతి పత్రాన్ని అందజేశారు.సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.


