ఆపదలో అండగా నిలిచే మహానేత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – చావా శివరామకృష్ణ
రిపోర్టర్:దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,జూన్ 3 (నమస్తేన్యూస్)
ప్రజలకు కష్టసమయంలో అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవ అని నిరూపిస్తున్న తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సేవలు ఆదర్శప్రాయమని పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ అన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను స్వయంగా పరామర్శిస్తూ, తిరుమలాయపాలెం మండలంలోని కొక్కిరేణి, బాలాజీనగర్ తండా, పిండిప్రోలు, తెట్టెలపాడు, గోపాయిగూడెం, పాతర్లపాడు, తిప్పారెడ్డిగూడెం, జల్లేపల్లి, హైదర్ సాయిపేట, పడమటి తండా, చంద్రు తండా, కుక్కల తండా, మేడిదపల్లి, సుబ్లేడు, హస్నాబాద్, లక్ష్మీదేవిపల్లి, జూపేడ, కాకరవాయి, ఏనుకుంట తండా, సోలీపురం, బచ్చోడు తండా, బచ్చోడు, బీరోలు, ఏలువారిగూడెం, తాళ్ళచెరువు గ్రామాల్లోని 51 బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.5,10,000 ఆర్థిక సహాయాన్ని అందించడం గొప్ప మానవతా కార్యక్రమం అని కొనియాడారు.ఈ సందర్భంగా చావా శివరామకృష్ణ మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా నిలిచే నాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. బాధలో ఉన్న కుటుంబాలను ఓదార్చి, వారికి ఆర్థిక భరోసా కల్పించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం సేవ చేస్తున్న మంత్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలను కొనసాగిస్తాం” అని పేర్కొన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పాలేరు నియోజకవర్గ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని చావా శివరామకృష్ణ అన్నారు. ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి వెంటనే స్పందించే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిందని ఆయన ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బోడ మంగీలాల్ మండల కాంగ్రెస్ నాయకులు గుగ్గిళ్ళ అంబేద్కర్ తాటికొండ కిరణ్ పోట్ల కిరణ్ ధరావత్ వినోదం కర్నాటి రాజేంద్రప్రసాద్ వనవాసం నరేందర్ రెడ్డి సిరి గద్దె ఉపేందర్ పుసులూరి సురేష్ మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జడల నగేష్ ఆత్మ కమిటీ డైరెక్టర్ ఉప్పునూతల నాగేశ్వరరావు బెల్లం రాము చీమ లక్ష్మయ్య బానోతు సిమ్లా చామకూరి రమేష్ షేక్ సలీం పప్పుల సుధాకర్ బెజ్జనబోయిన రాంబాబు నరేష్ వేల్పుల వీరన్న కట్కూరి శ్రీనివాస్ రెడ్డి రామ్ రెడ్డి సంఘ బత్తుల సుమన్ భానోత్ అనిల్ ఉన్నాం సయ్యద్ ఇమామ్ వరిగడ్డి సాగర్ గొల్ల లింగయ్య గ్రామ నాయకులు పొంగులేటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
